: మండేలా డిశ్చార్జి కాలేదు, విషమంగానే ఆరోగ్యం: దక్షిణాఫ్రికా ప్రభుత్వం


నల్లసూరీడు నెల్సన్ మండేలా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని వచ్చిన వార్తలను దక్షిణాఫ్రికా అధ్యక్షుడి కార్యాలయం ఖండించింది. మండేలా కోలుకుని ఇంటికి చేరుకున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజంలేదని తెలిపింది. ఈమేరకు అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రతినిధి జోహాన్నెస్ బర్గ్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. మండేలా ఇంకా ప్రిటోరియా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం విషమంగానే ఉన్నా నిలకడగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు. మండేలా చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. మండేలా గత కొద్ది నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధికి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News