: శాంతిభద్రతలకు సమస్య లేకుంటే సభలకు అనుమతి: జానారెడ్డి
శాంతిభద్రతలకు ఏ విధమైన సమస్యా వాటిల్లదన్న భరోసా ఉంటే ప్రభుత్వం సభలకు, సమావేశాలకు అనుమతినివ్వవచ్చని మంత్రి జానారెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో.. తమ శాంతి ర్యాలీకి అనుమతినివ్వాలన్న తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలతో జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారులవల్ల శాంతిభద్రతలకు నష్టం వాటిల్లదనుకుంటే ప్రభుత్వం అనుమతి ఇస్తుందని వ్యాఖ్యానించారు.