: రేపటి నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆపేస్తాం: పరకాల
సీమాంధ్రలో ప్రజల రవాణా ఇక్కట్లు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే 13 జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, రేపటి నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను కూడా ఆపేస్తామని విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటుకు, అసెంబ్లీకి తాళాలు వేసి తెలుగువాడి సత్తా ఏంటో చూపాలని పిలుపునిచ్చారు. రాజీనామాలు చేసి రాజ్యాంగసంక్షోభం సృష్టిస్తేనే ప్రస్తుత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమం పాలపొంగులా చప్పున చల్లారిపోకూడదని, ప్రస్తుత ఒరవడి కొనసాగించాలని సూచించారు.