: 'అహింసా మెసెంజర్'ను ప్రారంభించిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 'అహింసా మెసెంజర్' పేరుతో తలపెట్టిన జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం చట్టాలు, పోలీసులతోనే మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు, హింసలను అడ్డుకోలేమని అభిప్రాయపడ్డారు. చట్టాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ఎంతో అవసరమన్నారు. సనాతన అభిప్రాయాలను దూరం చేసి మహిళలకు పురుషులతో సమానహోదా కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సోనియా పిలుపునిచ్చారు. ఇందుకోసం సామాజిక దృష్టి అవసరమని ఆమె తెలిపారు.