: జగన్ దీక్ష ఎవరి కోసం?: మోత్కుపల్లి


జగన్ ఎవరి కోసం దీక్ష చేస్తున్నారో స్పష్టం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. హైదరాబాదు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జగన్ కు జైల్లో సకల మర్యాదలు అందుతున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి.. చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిలా కనిపించడం లేదని, జైలు జీవితాన్ని ఆనందిస్తున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడని అన్నారు. జగన్ కు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్టున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయినప్పటికీ ఆ మూడు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మోత్కుపల్లి తెలిపారు.

  • Loading...

More Telugu News