: లేచి నిలబడలేకపోతున్న జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని నిమ్స్ డాక్టర్లు అంటున్నారు. జగన్ దీక్ష నేటికి ఏడోరోజుకు చేరుకోగా ఆయన ప్రస్తుతం లేచి నిలబడలేని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే, ఆరోగ్యం విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జగన్ దీనికి నిరాకరిస్తున్నట్టు సమాచారం. నిమ్స్ లో డాక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో జగన్ కు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్య స్థితిపై బులెటిన్ విడుదల చేశారు. జగన్ లేచి నిలుచుంటే బీపీ డౌన్ అయిపోతోందని, రక్తంలో షుగర్ లెవెల్స్ తో పాటు కిడ్నీ పారామీటర్స్ కూడా తగ్గిపోయాయని ఈ నివేదికలో వెల్లడించారు.