: ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తించాలి: చంద్రశేఖర్
రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీకి మనుగడ ఉండదని ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ కార్మిక సంఘం ఏర్పాటు చేసిన నిరసన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించని పక్షంలో ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని డిమాండ్ చేశారు.