: దిగ్విజయ్ శనిలా దాపురించాడు: వీరశివారెడ్డి


గులాంనబీ ఆజాద్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్నప్పుడు ఏపీ ప్రశాంతంగా ఉందని, దిగ్విజయ్ సింగ్ వచ్చాకే రాష్ట్రం అల్లకల్లోలమైందని ఎమ్మెల్యే వీరశివారెడ్డి వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ ను రాష్ట్రానికి పట్టిన శనిలా అభివర్ణించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్న టీడీపీ నేతలకు వీరశివా సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ.. ఈ మూడు పార్టీలు కూడా తాజా పరిస్థితికి కారణమని ఆరోపించారు. అందరిలోకెల్లా సమైక్యవాదాన్ని ఘనంగా చాటుతున్న సీఎం కిరణ్ ను 'ఒక్క మగాడు' అని కీర్తించారు. రాష్ట్ర ప్రజల కోసం కిరణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని ఈ కమలాపురం ఎమ్మెల్యే అంటున్నారు. ఇక, చంద్రబాబు బస్సు యాత్రకు సిద్ధమవుతుంటే, సీమాంధ్రలో ప్రజలు విసిరేందుకు రాళ్ళను సిద్ధం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News