: పిఠాపురాన హోరెత్తిన 'లక్ష గళ ఘోష'


పిఠాపురం పట్టణంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు కదంతొక్కారు. వేలాదిగా తరలి వచ్చిన వివిధ వర్గాల ప్రజలు నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 'లక్ష గళ ఘోష' కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది ఉద్యోగులు, స్థానికులు భారీ ర్యాలీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తెలుగు ప్రజలను విడదీయాలని చూస్తే ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని ఉద్యమకారులు హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News