: ఆగ్రాలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదు


ఆగ్రా జిల్లాలో ఈసారి సగటు వార్షిక వర్షపాతం రికార్డుస్థాయిలో నమోదైంది. దాదాపు 700 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షం ఆగస్టు నెలలో రికార్డుకెక్కిందని వాతావరణ అధికారులు తెలిపారు. సాధారణంగా ఈ నెలలో 200 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, ఆగ్రాలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. సెప్టెంబర్ లోనూ ఇక్కడ కొంత వర్షపాతం నమోదవుతుందని పర్యావరణ అధికారి శ్రవణ్ కుమార్ సింగ్ చెప్పారు.

  • Loading...

More Telugu News