: జగన్ దీక్ష విరమించాలి.. బాబు సీమాంధ్రులకు నచ్చజెప్పాలి: గుత్తా
జగన్ దీక్షను విరమించి సమన్యాయం అంటే ఏమిటో, తెలంగాణ ఏర్పాటు చేయాలో, వద్దో? స్పష్టం చేయాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఆదివారం నుంచి సీమాంధ్రలో చేపట్టనున్న బస్సుయాత్రలో, రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలు ఎలాంటి పురోగతి సాధిస్తాయో ప్రజలకు విడమర్చి చెప్పాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీలు ద్వంద్వ వైఖరి విడనాడి స్పష్టతతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన అనివార్యమన్న సంగతి అక్కడి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆయా పార్టీల నేతలదేనని ఆయన అన్నారు.