: మహాకుంభమేళాలో కోట్లాది భక్తుల మాఘ పౌర్ణమి స్నానాలు


మాఘ పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళా భక్తులతో పోటెత్తింది.  పెద్ద సంఖ్యలో జనం పవిత్ర స్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచే స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ ఒక్కరోజే కోటి యాబై లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

55 రోజుల కుంభమేళాలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా మాఘ పౌర్ణమిని భక్తులు భావిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భద్రతా చర్యల దృష్ట్యా స్నానఘట్టాల్లో ఫోటోలు తీయడాన్ని నిషేధించారు. 

ప్రయాగ ఘాట్‌, రాయ్‌బరేలీ, లక్నో, ఫైజాబాద్‌ , అయోధ్య , సుల్తాన్‌పూర్ పట్టణాల్లో‌ అదనపు టిక్కెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో కుంభమేళా ఘాట్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. అడుగడుగునా సీసీ కెమెరాలు అమర్చారు.

  • Loading...

More Telugu News