: గుండె కండర కణాలను పునర్నిర్మించే పట్టీ


ఏదో గుండె మీద పట్టీ అతికించేయడం అంటే.. కాస్త నొప్పిని హరించే పట్టీల గురించి మాత్రమే తెలుసు మనకి! కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎలాంటి పట్టీని రూపొందించారంటే.. దీనిని దెబ్బతిన్న గుండె కండరాల మీద అతికిస్తే.. ఆ కండరాలు చాలా త్వరగా యథాపూర్వ స్థానానికి రావడానికి ఇది ఉపకరిస్తుంది. మామూలుగా గుండె కండరాలు దెబ్బతింటే గనుక.. అవి తిరిగి బాగయ్యే అవకాశాలు చాలా తక్కువ.

అందుకని శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిలో ఆలోచించి ఈ పట్టీని రూపొందించారు. ఇది కేవలం మెడికల్‌ పట్టీ కాదు. కండరాల్లో ఉండే కొలాజెన్‌ అనే ప్రొటీన్‌తో రూపొందించిన పట్టీ. దాన్ని కొంచెం మార్చి కూర్చి దీనిని చేశారు. ఎలుకల్లో దెబ్బతిన్న గుండె కండరాలపై దీన్ని అంటించినప్పుడు.. కొత్తకణాలు, రక్తనాళాలు కూడా మళ్లీ రూపొందుతున్నట్లు గర్తించారు. ఇది గుండె కణజాలం పైపొర స్థానాన్ని ఆక్రమిస్తోంది. గుండె కండరానికి ఓ కవచంలాగా నిలుస్తుందన్నమాట. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ల్యూసెల్‌ పకార్డ్‌ పిల్లల ఆస్పత్రికి చెందిన పరిశోధకులు ఈ కొలాజెన్‌ కండరాల పట్టీని రూపొందించి ఘనత సాధించారు.

  • Loading...

More Telugu News