: వైజాగ్ మ్యాచ్ డ్రా


భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య విశాఖపట్నంలో జరిగిన మూడు రోజుల మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 310 పరుగులకు ఆలౌటయ్యారు. భారత యువ స్పిన్నర్ జలజ్ సక్సేనా 6 వికెట్లతో న్యూజిలాండ్ వెన్నువిరిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఏ ఆట చివరికి 7 వికెట్లకు 388 పరుగులు చేసింది. మరో ఇన్నింగ్స్ ఆడే సమయం లేకపోవడంతో ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. కాగా, భారత్ ఇన్నింగ్స్ లో యువకెరటం విజయ్ జోల్ (110) మరోసారి సెలక్టర్లను ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కెప్టెన్ అభిషేక్ నాయర్ (102 నాటౌట్) కూడా సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ కు విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ మైదానం వేదిక కాగా, తొలిరోజు ఆట వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News