: ఢిల్లీకి తప్పిన ముప్పు
దేశ రాజధాని ఢిల్లీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. సోమవారం ఇక్కడి కంటోన్మెంట్ ప్రాంతంలో బాంబును కనుగొన్నారు. దీన్ని పరిశీలించిన బాంబు స్క్వాడ్ బృందం నిర్వీర్యం చేసింది. దీంతో పెద్ద గండం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లాప్ టాప్ లో బాంబును అమర్చినట్టు తెలుస్తోంది. కాగా, గ్రేటర్ కైలాష్ లో పోలీసులు ఓ అనుమానాస్పద బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు సంఘటనలతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు.