: నాలాంటి వారిని అవమానిస్తే ఏం ప్రయోజనం?: ధర్మాన


శ్రీకాకుళంలో సమైక్య సమరనాదం సభలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనలాంటి వారిని అవమానిస్తే ప్రయోజనం ఏముంటుందని వ్యాఖ్యానించారు. తనను రాజీనామా చేయాలని కోరడం సబబు కాదన్నారు. ఇక, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ ప్రభుత్వమైనా ఫలితం అనుభవించకతప్పదని అన్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ కూడా ప్రజాగ్రహానికి గురికాకతప్పదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News