: సీమాంధ్ర నేతల మాటలు ప్రజలు నమ్మొద్దు: కోదండరాం
తెలంగాణను అడ్డుకుంటామని సీమాంధ్ర నేతలు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మొద్దంటున్నారు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, విభజన ప్రకటన అనంతరం రెండు ప్రాంతాల మధ్య పెద్ద చీలిక ఏర్పడిందని, కలిసి ఉండడం అసాధ్యమని అన్నారు. ప్రజల్లో ఏర్పడిన అపోహలను కిరణ్, చంద్రబాబు స్వార్థానికి వినియోగించుకుంటున్నారని కోదండరాం ఆరోపించారు.