: చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్


టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆశోక్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు యాత్ర దేనికోసమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బాబు కేంద్రానికి లేఖ రాయాలని ఆయన సూచించారు. ఓవైపు సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే, బాబు స్పష్టత లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. బాబు ఏం చెబుతున్నారో ప్రజలకు అర్థంకావడంలేదని అశోక్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News