: సమైక్యాంధ్ర సభకు వస్తానంటున్న మంత్రి


వచ్చే నెల 7న హైదరాబాదులో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు తాను హాజరవుతానని రాష్ట్ర మంత్రి పార్ధసారథి స్పష్టం చేశారు. హైదరాబాదులో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం కిరణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. గత రాత్రి సీఎం మాట్లాడిన విషయాల్లో తప్పేమీలేదన్నారు. ప్రజల ఆకాంక్షలే సీఎం నోట వెలువడ్డాయని అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళగలిగింది సీఎం ఒక్కరే అని పార్థసారథి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News