: కొలీజియం వ్యవస్థ రద్దుకు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత తీసుకువచ్చే దిశగా కొలీజియం వ్యవస్థ రద్దు బిల్లును కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులను ఇప్పటివరకు ఈ కొలీజియం వ్యవస్థ ద్వారానే నియమిస్తున్నారు. అయితే, ఇక నుంచి న్యాయమూర్తుల నియామకం, బదిలీల కోసం ప్రత్యేకంగా న్యాయ నియామకాల కమిషన్ ( జేఏసీ)ను ఏర్పాటు చేయాలని కేంద్రం తలపోస్తోంది. ఈ క్రమంలో బిల్లును ప్రవేశపెట్టింది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో వివాదాలకు తావులేకుండా చేయడం, ఎంపికలో జవాబుదారీతనమే లక్ష్యంగా ప్రతిపాదిత జేఏసీ ఉంటుందని కేంద్రం చెబుతోంది. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం పేరిట ఈ జేఏసీలో రెండు విభాగాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. రెండింటికి సమ ప్రాతినిధ్యం ఉంటుందని బిల్లులో వివరించారు.