: 'ఫేస్ బుక్' లో నకిలీ ప్రొఫైల్ తో వేధించిన వ్యక్తి అరెస్టు


పెరిగిన నెట్ వాడకం, పలు వెబ్ సైట్ల రంగ ప్రవేశం ఆధునిక మానవుడికి అధిక సౌలభ్యంతో పాటు సమస్యలు కూడా తెచ్చి పెడుతున్నాయి. ఈ మధ్య ఫేస్ బుక్ ను వేదికగా చేసుకుని అనేక ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఎఫ్ బీలో నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఓ యువతిని వేధిస్తున్న బెంగళూరులోని సుబ్రహణ్యం నగర్ కు చెందిన సంతోష్ కుమార్ అనే యువకుడిని హైదరాబాదులోని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు పంపారు.

ఫేస్ బుక్ ద్వారా మియాపూర్ కు చెందిన యువతికి, అతడికి ఏర్పడిన పరిచయంతో ఆమె ఫోటోలు యువకుడి వద్దకు చేరాయి. ఆ ఫోటోలను అభ్యంతరకరంగా మార్చి ఫేస్ బుక్ లో స్నేహితులకు షేర్ చేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దాంతో, విషయాన్ని యువతి తన సోదరుడికి చెప్పడంతో అతను సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ నంబరు ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News