: మూడోసారి వాయిదాపడ్డ లోక్ సభ
రూపాయి పతనంపై ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన అనంతరం కూడా లోక్ సభలో మునుపటి పరిస్థితే కనిపించడంతో స్పీకర్ మీరాకుమార్ సభను మూడోసారి వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై ప్రధాని ప్రకటన చేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. వీరికి మద్దతుగా న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దాంతో సభ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదాపడింది.