: భద్రత దళాల కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్ లోని గండర్ బల్ జిల్లాలోని ప్రంగ్ సమీపంలోని నజవాన్ అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిపిన కాల్పుల్లో భద్రతదళాలు ఐదుగురు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నజవాన్ అడవుల్లో కాశ్మీర్ పోలీసులు, 24వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన భద్రతదళాలు గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో తీవ్రవాదులు తారసపడ్డారు. దాంతో, ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రవాదులు హతమయ్యారు. వీరంతా లష్కరే తోయిబా సంస్థకు చెందిన అసదుల్లా వర్గానికి చెందిన వారని హోంశాఖ తెలిపింది.