: టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ పాదయాత్ర


సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు పాదయాత్ర చేస్తున్నారు. జిల్లాలోని రామచంద్రాపురం మండలం పరిధిలోని కొత్తకండ్రిగ పంచాయతీ తాటిమాకుల కండ్రిగ నుంచి యాత్ర ప్రారంభించారు. స్థానిక రాయలచెర్వు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. యాత్రలో మండల టీడీపీ నేతలు కేశవులనాయుడు, దేవానందనాయుడు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News