: ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రిలో దీక్షను కొనసాగిస్తున్నారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బీపీ, షుగర్ సాధారణ స్థాయిలో ఉన్నాయని, గ్లూకోజ్ స్థాయి తగ్గుతోందని వైద్యులు తెలిపారు. 11 గంటలకు వైద్య పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టులు వస్తాయని తెలిపారు. కాగా, జగన్ వైద్యానికి నిరాకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేనందున జగన్ ను నిమ్స్ కి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.