: విజయకాంత్ కు కోర్టు వార్నింగ్
విజయకాంత్ ఈ రోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈయన గైర్హాజరవడంతో కోర్టు సీరియస్ అయింది. వివరాల్లోకి వెళితే.. గత అక్టోబరులో తన సొంత ఛానెల్ అయిన కెప్టెన్ టీవీలో... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై విజయకాంత్ కొన్నిఅభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం విజయకాంత్ పై క్రిమినల్ కేసు పెట్టింది. అయితే కేసు వాయిదాలకు విజయకాంత్ గైర్హాజరు అవుతుండటంతో... గతంలోనే కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కానీ విజయకాంత్ తరుపు లాయర్లు.. ఆయన ఈరోజు హాజరవుతారని చెప్పడంతో కోర్టు వారెంట్ ను రద్దుచేసింది. కానీ విజయకాంత్ ఈ రోజు కూడా ఎప్పటిలాగానే కోర్డుకు డుమ్మా కొట్టారు. దీనికి శ్రీకృష్ణ జయంతిని సాకుగా చూపారు. దీంతో సీరియస్ అయిన కోర్టు కేసును సెప్టెంబర్ 12 కు వాయిదావేసి.... అప్పుడు కూడా విజయకాంత్ కోర్టుకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.