: పంజాబ్ లో స్వల్ప భూకంపం
పంజాబ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7 గా నమోదైంది. అమృతసర్, జలంధర్, హోషియార్ పూర్, గుర్ దాస్ పూర్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని కొన్నిప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ ప్రకంపనల వల్ల జరిగిన నష్టంపై సమాచారం లేదు. నిపుణులు మాత్రం ఈ భూకంపం తీవ్రమైంది కాదని, దీని వల్ల పెద్దగా నష్టం సంభవించే అవకాశం లేదని తెలిపారు.