: భారత్ లో పర్యటించిన స్నోడెన్ !
అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ 2011 సంవత్సరానికి ముందు భారత్ లో పర్యటించాడని ఒక అంతర్జాతీయ పత్రిక వెల్లడించింది. తన భారత పర్యటనకు సంబంధించిన వివరాలను అతను ఎన్ఎస్ఏకి రిపోర్ట్ చేయలేదని కూడా పేర్కొంది. భద్రతా సంస్థకు సంబంధించిన అంతర్గత విచారణలో కూడా ఈ విషయం కనిపెట్టలేకపోయారని తెలిపింది. ఇదే సంస్థలో సూపర్ వైజర్ గా పనిచేస్తోన్న ఒక అధికారి ద్వారా ఈ విషయం బయటకు తెలిసినా... స్నోడెన్ ఇండియాకు ఎందుకు వెళ్లాడనే విషయాన్ని భద్రతా సంస్థ కనిపెట్టలేకపోయిందని తెలిపింది.
కాగా, 30 ఏళ్ల ఎడ్వర్డ్ స్నోడెన్, తనకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ ఇప్పటిదాకా దాదాపు డజనుకు పైగా దేశాలను సందర్శించాడని ఆ పత్రిక తెలిపింది. అయితే స్నోడెన్ కు ఆశ్రయం కల్పించడానికి భారత్ అంగీకరించలేదని పేర్కొంది. ప్రస్తుతం స్నోడెన్ రష్యాలోని ఓ గుర్తుతెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అతన్ని తనకు అప్పగించాలని అమెరికా ఎంతగా కోరుతున్నా... ఆ విన్నపాన్ని రష్యా తిరస్కరిస్తోంది.