: భత్కల్ కస్టడీ కోరుతున్న పలు రాష్ట్రాలు


జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ని విచారించేందుకు పలు రాష్ట్రాలు అతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతున్నాయి. గతంలో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, సూరత్, హైదరాబాదు పేలుళ్ల కేసులో భత్కల్ ప్రధాన నిందితుడు. దాంతో, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అతడిని కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏను కోరనున్నాయి. మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్ మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలకు భత్కల్ అరెస్టు పెద్ద విజయం అన్నారు. మహారాష్ట్రలో నమోదైన ఎనిమిది కేసుల్లో అతన్ని విచారించాల్సి ఉందని ప్రకటించారు.

తమ రాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ భత్కల్ ను ముంబయి, పుణే, జర్మనీ బేకరీ పేలుళ్ల కేసుల్లో విచారిస్తుందని పేర్కొన్నారు. అటు బెంగళూరు పేలుళ్ల కేసులో భత్కల్ ను ప్రశ్నించడానికి కర్ణాటక పోలీసులు కూడా కస్టడీ కోరనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే అందుకు కొంత సమయం పడుతుందని సమాచారం. ఇప్పటికే భత్కల్ ను విచారణ కోసం హైదరాబాదు తీసుకొస్తామని ఏపీ పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News