: జగన్ అక్రమాస్తుల కేసులో చర్యలు తీసుకోండి: టీడీపీ ఎంపీలు


జగన్ అక్రమాస్తుల కేసులో తక్షణం చర్యలు తీసుకోవాలని ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కు టీడీపీ ఎంపీలు వినతి పత్రం సమర్పించారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్లను శిక్షించడంలో జాప్యం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. దోపిడీ జరిగిన ప్రజాధనంలో కనీసం 5 శాతం కూడా జప్తు కాలేదని ఆయన మండిపడ్డారు. ప్రజాధనాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత ఈడీదేనని, అందుకే తక్షణం జగన్ పై చర్యలు తీసుకోవాలని నామా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News