: శరత్ కుమార్ కు న్యూజెర్సీ అసెంబ్లీ సత్కారం


రాజకీయవేత్తగా మారిన సినీ నటుడు శరత్ కుమార్ ను న్యూజెర్సీ రాష్ట్ర శాసనసభ సత్కరించింది. రాజకీయాల్లో ప్రవేశించి తేన్ కాశి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికైన శరత్ కుమార్ (ఏఐఎస్ఎమ్కే పార్టీ).. నియోజకవర్గానికి చేసిన సేవలకు గాను ఆయనను సత్కరించినట్టు న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర తెలిపారు. సెంట్రల్ అసెంబ్లీ హాల్ లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ షీలా ఒలీవర్ సంతకం చేసిన జ్ఞాపికను శరత్ కుమార్ కు అందజేశారు. శరత్ కుమార్ మూడో సారి సౌతిండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికయిన సంగతి తెలిసిందే. ఈయన గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా పదవీబాధ్యతలు నిర్వర్తించారు.

  • Loading...

More Telugu News