: బొగ్గు పైళ్ల గల్లంతుపై కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
బొగ్గు క్షేత్రాల కేటాయింపుకు సంబంధించిన ఫైళ్ల గల్లంతుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రంపై మండిపడింది. ఈ విషయాన్ని తప్పుబట్టిన కోర్టు ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. కేటాయింపులకు సంబంధించిన అన్ని ఫైళ్లు సీబీఐకి ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని ఆదేశించింది. అటు బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. 169 సంస్థలపై దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని ఆదేశించింది.