: రేపు టీటీడీ ఉద్యోగుల సామూహిక సెలవు
సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రేపు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులు తమకు తాము సామూహిక సెలవు ప్రకటించుకున్నారు. ఇందులో శ్రీవారి అర్చకులు కూడా పాల్గొంటున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఐదువేల మంది భారీ ప్రదర్శన చేయనున్నారు. దాంతో, నిర్వహణ భారం అంతా కిందిస్థాయి ఉద్యోగులపైనే పడనుంది. ఓవైపు శ్రీవారి పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని చెబుతున్నా, టీటీడీ కార్యక్రమాలు ఎలా జరుగుతాయనేది సందిగ్ధంలో ఉంది. ప్రస్తుతం తిరుమల అష్ట దిగ్బంధం నేపథ్యంలో శ్రీవారికి భక్తుల తాకిడి తక్కువగా ఉంది.