: చంచల్ గూడ జైలు వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తల అరెస్ట్
జగన్ నిరాహార దీక్ష చేస్తున్న చంచల్ గూడ జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ కు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత రెహ్మాన్ ఆధ్వర్యంలో... పార్టీ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైలు పరిసరాల్లో ప్రదర్శనలకు వీలు లేదంటూ... రెహ్మన్ తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. కాగా, ఈ రోజుతో జగన్ చేస్తున్న దీక్ష ఐదో రోజుకు చేరుకుంది.