: సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఏపీఎన్జీవోల భేటీ
పార్లమెంట్ లో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఏపీఎన్జీవో నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిన్న దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై చర్చించినట్టు సమాచారం. ప్రతిపక్ష నేతలంతా సానుకూలంగా స్పందిస్తుండగా కేవలం కాంగ్రెస్ నేతలే విభజన అంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రూపొందించాల్సిన కార్యాచరణపై వారు చర్చించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని వారు స్పష్టంచేశారు.