: ఇడ్లీ సాంబారే బెస్ట్


మూడు ఇడ్లీలను కప్పు సాంబారులో మిక్సు చేసి తింటుంటే ఉంటుందీ.. అబ్బో! రుచిలోనే కాదు ఇది మంచి పోషకాహారం కూడానట. పోషకపాళ్లు దండిగా ఉన్న అల్పాహారం ఇదేనని ఒక అధ్యయనం తేల్చేసింది. వీటికి ఒక కాఫీ కూడా జతచేస్తే ఇంకా సూపర్. చెన్నై సంపద్రాయ అల్పాహారం మిగతా మెట్రో నగర వాసుల అల్పాహారం కంటే పోషకసహితమని 'భారతీయుల అల్పాహార అలవాట్లపై అధ్యయనం' వెల్లడించింది. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కత నాలుగు మెట్రోలలో 3,600 మందిపై నమూనా సర్వేగా దీనిని నిర్వహించారు. కెల్లాగ్స్ దీనికి నిధుల సహకారం అందించింది.

కోల్ కతా సంప్రదాయ అల్పాహారం ఎక్కువగా మైదాతో ఉంటుందట. దీనివల్ల కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నా, ప్రొటీన్ తక్కువని, ఫైబర్ అసలే ఉండదని అధ్యయనం నిర్వహించిన మాలతి శివరామకృష్ణన్ చెప్పారు. ఢిల్లీ పరాటాలలో నూనె మరీ ఎక్కువని, ముంబై వాసులు ఎక్కువగా బ్రెడ్ తింటుంటారని ఆమె తెలిపారు. వీటిలో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయన్నారు. ఇక ఇడ్లీ సాంబార్ లో బియ్యం, మినప్పప్పు ఉండడం వల్ల ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుందని, సాంబార్ లో పప్పు, కూరగాయల ముక్కలు అన్నీ కలిపి ఆరోగ్యానికి పోషకరక్షణగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News