: భత్కల్ అరెస్టు ధ్రువీకరించిన హోం మంత్రి
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ళ ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ అరెస్టును కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ధ్రువీకరించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భత్కల్ పట్టుబడడం నిజమేనన్నారు. అతడు ప్రస్తుతం బీహార్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని వెల్లడించారు. అతనిపై విచారణ కొనసాగుతుందని చెప్పారు.