: దమ్ముంటే చంద్రబాబుపై కేసు పెట్టండి..చూద్దాం: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
దమ్ముంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ప్రజల్లో మమేకమైన తమ పార్టీ అధినేతపై విమర్శలు చేయడం మానుకోవాలని లేకుంటే చంద్రబాబు వెంట ఉన్న రైతులు, పేదలు కాంగ్రెస్ నేతలను ఉరి తీస్తారని రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలు చేసి, జైలులో ఉన్న నేతలను మాని..తమ అధినేతను విమర్శించడం తగదని ఆయన మండిపడ్డారు.