: లోక్ సభలో నేడు 'భూ సేకరణ బిల్లు'.. విప్ జారీ చేసిన కాంగ్రెస్
లోక్ సభలో కేంద్రం నేడు మరో ప్రతిష్ఠాత్మక బిల్లును ప్రవేశపెట్టనుంది. అత్యంత చర్చనీయాంశమైన 'భూ సేకరణ బిల్లు'ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ సభలో ప్రవేశపెట్టనున్నారు. సభకు హాజరై ప్రభుత్వ కార్యకలాపాలకు మద్దతుగా నిలవాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ సభ్యులకు విప్ జారీ చేసింది. పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరించినప్పుడు.. భూమిని అప్పగించే కుటుంబాలకు న్యాయబద్దమైన పరిహారం ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. అనేక లోపాలున్న 1894 నాటి భూ సేకరణ చట్టం స్థానంలో బిల్లును తీసుకొస్తున్నారు.