: సిరియాపై సైనిక చర్య నిర్ణయించలేదు: ఒబామా


సిరియాపై సైనిక దాడిపై నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు ఒబామా తెలిపారు. సిరియా ప్రభుత్వ దళాలు ఈ నెల 21న డమాస్కస్ లో అమాయక పౌరులపై రసాయన దాడికి పాల్పడడం, వందలమంది మరణించడం తెలిసిందే. దీనిపై అమెరికా చాలా ఆగ్రహంతో ఉంది. దీంతో సిరియాపై అగ్రరాజ్యం సైనిక చర్యకు దిగడం ఖాయమన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పౌరులపై రసాయన దాడి అంతర్జాతీయ విధానాలకు వ్యతిరేకమని ఒబామా పేర్కొన్నారు. దాడికి సంబంధించిన ఆధారాలు సేకరించామన్నారు. ఆందోళనకారుల వద్ద రసాయనిక ఆయుధాలు లేవని, దాడి చేసింది సిరియా ప్రభుత్వమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో సిరియా అంతర్జాతీయంగా తగిన చర్యలను ఎదుర్కొనవలసి వుంటుందని ఆయన హెచ్చరించారు. తమ దేశంపై దాడి చేస్తే దీటుగా ఎదుర్కొంటామని సిరియా ప్రకటించగా, దాడి ఆలోచన మానుకోవాలని రష్యా, ఇరాన్‌లు కూడా సూచించాయి.

  • Loading...

More Telugu News