: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు దుర్మరణం
నల్గొండ జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారికి దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని దేవరకొండ మండలం కొండమల్లేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కూలీల డీసీఎం వ్యాను బోల్తా పడింది. దాంతో, ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వ్యానులో ఉన్న 60 మంది కూలీలు వ్యవసాయ పనులకోసం మరో ప్రాంతానికి వెళుతున్నారు.
మరొక సంఘటనలో గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కందిపాడు సమీపంలో వ్యాను, ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.