: జగన్ దళంలోకి తమ్మినేని సీతారాం
ఉత్తరాంధ్రలో మరో కీలక నేత తమ్మినేని సీతారాం వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. తెలంగాణకు అనుకూలమంటూ లేఖ ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఆయన టీడీపీ కోట నుంచి బయటకు దూకారు. టీడీపీ పొలిట్ బ్యూరో నేతగా ఉన్న ఉత్తరాంధ్ర నేత దాడి వీరభద్రరావు ఈ ఏడాది మే నెలలో జగన్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి మరో నేతను టీడీపీ కోల్పోయింది. దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది వచ్చే ఎన్నికల్లో గానీ తెలియదు.