: జగన్ దీక్ష భగ్నానికి రంగం సిద్ధం?
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష నేటికి ఐదవ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ, జైలు అధికారులు మాత్రం జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని నిన్న సాయంత్రం ప్రకటించారు.
వాస్తవానికి వేరొకరు అయితే ఈ పాటికి అధికారులు దీక్షను భగ్నం చేసి ఉండేవారని.. జగన్ విషయంలో మాత్రం ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే దీక్షపై చర్యలు తీసుకోవాలని జైలు అధికారులు సీబీఐ కోర్టును అభ్యర్థించారు. కానీ, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే, జగన్ ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉండడంతో దీక్షను భగ్నం చేసేందుకు, అవసరమైతే అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.