: రాష్ట్రపతితో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతలు కలిశారు. ఢిల్లీలో ఆంటోనీ కమిటీని కలిసిన నేతలు అనంతరం రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలపై వివరించారు. సమైక్యాంధ్రవైపే ప్రజలంతా ఉన్నారని వీరు రాష్ట్రపతికి తెలిపారు. ప్రణబ్ తో భేటీలో మంత్రులు ఆనం రామానారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిలు ఉన్నారు.