: 30 న సీమాంధ్ర వాణిజ్య సముదాయాలు బంద్
ఈ నెల 30న సీమాంధ్రలో వాణిజ్య సముదాయాలు బంద్ పాటించనున్నట్టు సమైక్యాంధ్ర పరిరక్షణ వర్తక జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలు ఉద్యమంలో పాల్గొంటున్నాయి. ఉద్యమ ప్రభావంతో ఇప్పటికే సీమాంధ్రలో వాణిజ్య సముదాయాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ వాణిజ్య జేఏసీ తాజాగా బంద్ నిర్ణయం తీసుకోవడం విశేషం.