: అసలే పోలీసు.. ఆపై తాగాడు..


అతనో పోలీసు అధికారి. శాంతిభద్రతలను కాపాడడం అతని విధి. కానీ, ధర్మం తప్పి వ్యవహరించాడు. బాగా తాగి ఓ డాక్టర్ పై కాల్పులు జరిపాడు. హర్యానాలోని కర్నాల్ లో జరిగిందీ ఘటన. కాశ్మీరా సింగ్ హర్యానా పోలీసు విభాగంలో అధికారి. అతగాడు ఫుల్లుగా మందుకొట్టి కల్పనా చావ్లా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు వెళ్ళాడు. నేరుగా డాక్టర్ నిపుణ్ కల్రా రూముకు వెళ్ళి తనకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ కావాలని అడిగాడు. అందుకు డాక్టర్ నిరాకరించడంతో తన సర్వీస్ రివాల్వర్ తీసి కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన డాక్టర్ నిపుణ్ కిందకు వంగడంతో బుల్లెట్ పై నుంచి దూసుకెళ్ళింది. వెంటనే డాక్టర్ అక్కడి నుంచి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా, ఈ సన్నివేశం అంతా సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఆ సమయంలో డాక్టర్ రూంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్టు సీసీటీవీ పుటేజి బయటపెట్టింది. ఈ కాల్పుల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News