: సోనియా ఇచ్చిన మాట వెనక్కి తీసుకోరు: గీతారెడ్డి


ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే అలవాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేదని మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. ఈ మధ్యాహ్నం ఆమె నివాసంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయానికి అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రాంతాలుగా విడిపోయినా కలిసి ఉండొచ్చని ఆమె సూచించారు. తెలంగాణ వాసులపై దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News