: పేలుళ్ల నిందితులకు దుబాయ్ నుంచి డబ్బు!
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటనలో నిందితులకు దుబాయ్ నుంచి డబ్బు అందినట్టు ప్రాథమిక సమాచారం లభించింది. దుబాయ్ లోని అల్ ఖుజీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి ఈ డబ్బు హవాలా మార్గాల ద్వారా నగరానికి చేరిందని అనుమానిస్తున్నారు. కాగా, దిల్ సుఖ్ నగర్ ఘటన వెనుక యాసిన్ భత్కల్ హస్తం ఉన్నట్టు అనుమానాలు నానాటికి బలపడుతున్నయి.
అయితే, సీసీటీవీ పుటేజి మరీ అస్పష్టంగా ఉండడంతో అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) సహకారం తీసుకోవాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భావిస్తోంది. ప్రస్తుతం సీసీటీవీ పుటేజిని ముంబయిలోని ఓ ఫిలిం ల్యాబ్ లో పరిశీలిస్తున్నారు.