: సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకు పాకిన సమైక్యాంధ్ర ఉద్యమం
సమైక్యాంధ్ర ఉద్యమం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లకూ పాకింది. సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. 'కస్టమర్ కేర్ కు స్వాగతం. మీకు ఆంధ్రా కావాలంటే ఒకటి నొక్కండి, రాయలసీమ కావాలంటే రెండు నొక్కండి, తెలంగాణ కావాలంటే మూడు నొక్కండి, సమైక్యాంధ్ర కావాలంటే సోనియా గాంధీ పీక నొక్కండి' అంటూ సెటైర్ లు వేస్తున్నారు. చిరంజీవికి, కిరణ్ కు చీరలు కట్టి మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ సైట్లలో కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ ఆదాయంపై.. 'హైదరాబాద్ ఆదాయం అందరిదంటే ఎలా? తిరుపతి వెళతాం. అలా అని హుండీలో వాటా అడగం కదా?' అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కమేడియన్ ఆలీని పెట్టి 'ఒరేయ్ గూట్లే, జనం కట్టే పన్నులకి, హుండీలో వేసే ఆదాయానికి తేడా తెలీదురా?'అంటూ సెటైర్ పేలుస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఆసక్తికర సెటైరికల్ వ్యాఖ్యలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో రాజ్యమేలుతున్నాయి.