: మమతా బెనర్జీపై రూపొందిన వివాదాస్పద చిత్రం నిలిపివేత


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పదంగా చిత్రీకరించిన ఓ బెంగాలీ చిత్రం సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. 'కంగల్ మల్సాయ్' అనే పేరుతో రూపొందిన ఈ చిత్రంలో... ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సన్నివేశం, అలాగే ఆ రాష్ట్రంలో టాటాలకు వ్యతిరేకంగా జరిగిన సింగూర్ ఉద్యమం దృశ్యాలను ఉపయోగించారు.  

వీటితో పాటు కొన్ని సన్నివేశాల్లో అభ్యంతరకర భాషను వాడారని.. ఇలా పలు వివాదాస్పద అంశాలతో చిత్రీకరించిన ఈ సినిమాని విడుదల చేస్తే కొన్ని ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంటూ ఈ చిత్రాన్ని నిలిపివేశారు. మరోవైపు తన సినిమాని తనకి ఇష్టమైన రీతిలో తీసుకునే హక్కు దర్శకుడిగా తనకు ఉంటుందని  ఆ చిత్ర దర్శకుడు హరనాథ్ చక్రబర్తి .. అధికార దర్పంతో తమను నవ్వుల పాలు చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News